NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రామసభల్లోనే ‘రాజముద్ర’ పాస్ పుస్తకాల పంపిణీ

1 min read

ఒక నెల-ఒక గ్రామం-నాలుగు సమావేశాలు కార్యక్రమంతో క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారం

దెందులూరు శాసనసభ్యులు  ప్రభాకర్ స్పష్టం

క్యాంపు కార్యాలయంలో ఆదివారం నాడు సైతం నిత్య ప్రజా దర్బార్

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో అవినీతికి తావులేకుండా, సామాన్య ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించడమే తమ ప్రధాన ధ్యేయమని దెందులూరు శాసనసభ్యులు  ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం దుగ్గిరాలలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ‘నిత్య ప్రజా దర్బార్’ లో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలపై ఎమ్మెల్యే గారు ప్రజలకు ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు.ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులు పోయాయి-గ్రామసభల్లోనే పట్టాలుఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ.. “గత ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని, కానీ కూటమి ప్రభుత్వం రాగానే భూముల రీ-సర్వేలను పకడ్బందీగా నిర్వహించి రైతులకు పూర్తి భరోసా కల్పించిందన్నారు.” గతంలో పాస్ పుస్తకాల కోసం రైతులు, సామాన్యులు ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా నేరుగా గ్రామాల్లోనే బహిరంగ గ్రామసభలు నిర్వహిస్తూ ‘రాజముద్ర’ కలిగిన సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు నేరుగా అందజేస్తున్నామని తెలిపారు. ఇది కూటమి ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమన్నారు.

ఒక నెల-ఒక గ్రామం-నాలుగు సమావేశాలు

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడానికి ప్రభుత్వం మరో నూతన విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే వెల్లడించారు. “ఒక నెల – ఒక గ్రామం-నాలుగు సమావేశాలు” అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా గ్రామాల్లోనే ఉంటూ, స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పారదర్శకంగా పరిష్కరిస్తున్నారని వివరించారు.అవినీతికి పాల్పడితే ఉక్కుపాదమే-ఎమ్మెల్యే చింతమనేని హెచ్చరికగత గొడ్డలి పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేశారని, అవినీతి అక్రమాలకు నిలయంగా మార్చారని, అయితే కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శాఖల్లో కొందరు అధికారులు సిబ్బంది ఇంకా ఆ విధానాలను కొనసాగిస్తున్నారని , ప్రక్షాళన కోసం అటువంటి అధికారులు సిబ్బందిపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే చింతమనేని స్పష్టం చేశారు. “ఏ ప్రభుత్వ శాఖలోనైనా, ఏ అధికారి లేదా సిబ్బంది అయినా సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతూ అవినీతికి గానీ, లంచాలకు గానీ పాల్పడితే అస్సలు ఉపేక్షించేది లేదు అని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అవినీతి రహిత పారదర్శక పాలనకు తూట్లు పొడుస్తూ ఎవరైనా అధికారులు సిబ్బంది లంచాలు అడిగినా, అక్రమాలకు పాల్పడిన తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని, అటువంటి వారిపై కూటమి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది” అని స్పష్టం చేశారు.మర్యాదపూర్వక కలయిక l శుభలేఖల అందజేతఈరోజు ప్రజా దర్బార్ సందర్భంగా, పలువురు కూటమి నాయకులు మరియు ప్రజలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న పలు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను వారికి అందించి, రావలసిందిగా కోరారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించి, వాటిని సత్వరమే పరిష్కరిస్తామని కొండంత భరోసా ఇచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *