స్త్రీ శక్తి పథకంపై వైసీపీ తప్పుడు ప్రచారం ఫ్లాప్..
1 min read

హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్
కర్నూలు, న్యూస్ నేడు: స్త్రీశక్తి పథకంపై వైసీపీ పూర్తిగా తప్పుడు ప్రచారాలు చేస్తోందని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. రాష్ట్ర మంత్రి టి.జి భరత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్నారు. ఇప్పటి వరకు దాదాపు కోటి మందికి పైగా మహిళలు ఈ పథకం వల్ల లాభం పొందినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వానికి వస్తున్న మంచిపేరును చూసి ఓర్వకలేక వైసీపీ నేతలు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. అయినప్పటికీ వీటిని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. ఇలాంటి వైఖరి వలనే గడిచిన ఎన్నికల్లో వారికి 11 సీట్లు ప్రజలు ఇచ్చారన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతోందన్నారు. ఇప్పటికే 80 శాతం వాగ్దానాలు పూర్తి చేశామని, త్వరలో మరిన్ని అమలుచేస్తామన్నారు. ఇక కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు భారీగా పెట్టుబడులు వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంత యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు మంత్రి టి.జి భరత్ కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో శాంతమ్మ, షేక్ ఫర్జానా, లక్ష్మీదేవి పాల్గొన్నారు.

