అతిథిగృహం ప్రహరీ గోడ ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్
1 min read
10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం
70 మీటర్ల పొడవైన ప్రహరీ గోడ
పాల్గొన్న అధికారులు,జిల్లాలో జడ్పిటిసిలు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా పరిషత్ అతిధి గృహానికి 10 లక్షల రూపాయలతో నిర్మించే ప్రహరీ గోడ నిర్మాణ పనులకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ గురువారం ప్రారంభించారు. 70 మీటర్ల పొడవైన ప్రహరీ గోడ నిర్మాణ పనులను, జిల్లా పరిషత్ జనరల్ నిధుల నుండి మంజూరు చేయడం జరిగిందని, పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయడం జరిగిందని చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కె. భీమేశ్వరరావు, పంచాయతీరాజ్ ఎస్ఈ ఎం.వి. రమణారావు, డీఈ జె. శ్రీనివాస్, డిఆర్ఐ డీఈ శ్రీనివాస్, ప్రాజెక్ట్ డీఈ సురేష్, జిల్లాలోని జెడ్పిటిసి లు, ప్రభృతులు పాల్గొన్నారు.
