మంత్రి నాదెండ్ల మనోహర్ కి ఘన స్వాగతం పలికిన జోనల్ చైర్మన్
1 min read
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లాలో 3 రోజుల పాటు జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఏలూరుకు విచ్చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు, ఏలూరు జిల్లా ఇంచార్జీ మంత్రి నాదెండ్ల మనోహర్ కి ఏలూరు బైపాస్ వద్ద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరంతో కలిసి ఆర్టీసీ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి, గోపాలపురం జనసేన ఇంచార్జీ దొడ్డిగర్ల సువర్ణ రాజు, నూజివీడు జనసేన ఇంచార్జీ బర్మా ఫణి తదితరులు పాల్గొన్నారు.