NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వతంత్ర అభ్యర్థులను గెలిపించుకుంటాం..

1 min read
ఇండిపెండెంట్​ అభ్యర్థులతో హసీనాబేగం

ఇండిపెండెంట్​ అభ్యర్థులతో హసీనాబేగం

ఎన్​డబ్య్లూపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్​.హసీనాబేగం
పల్లెవెలుగు, కర్నూలు
కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికలలో ఇండిపెండెంట్​గా బరిలో దిగిన అభ్యర్థులను గెలిపించుకుంటామని ఎన్​డబ్య్లూపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్​.హసీనాబేగం ధీమా వ్యక్తం చేశారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 15వ వార్డు శవల మహాదేవమ్మ, 47వ వార్డు జొరదొడ్డి నరసమ్మ, 48వ వార్డు రామిరెడ్డిగారి భాస్కరమ్మ ఇండిపెండెంట్​ అభ్యర్థులుగా నామినేషన్​ దాఖలు చేశారని, వారికి మా పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో.. గెలిపించుకోవడం కూడా మాదే బాధ్యత అని పేర్కొన్నారు. వీరితోపాటు ఇంకా ఎవరన్నా మహిళా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉంటే … వారు నేషనల్ ఉమెన్స్ పార్టీ కార్యాలయంలో సంప్రదించవచ్చని, అలాంటి వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో మూడు వార్డులకి సంబందించిన అభ్యర్ధులు కర్నూలు జిల్లా ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ ఎన్. మేరీ, వింగ్ జనరల్ సెక్రెటరీ కృష్ణవేణి, యూత్ వింగ్ ప్రెసిడెంట్ ఇంతియాజ్, కొత్తపేట ఇంఛార్జి ప్రసన్న, గాంధీనగర్ కి చెందిన భార్గవి సుజాత, శ్రీరామ్ నగర్ విజయమ్మ, తాండ్రపాడు ఏ.సుజాత మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author