కొట్టుకున్న టీడీపీ, వైసీపీ నాయకులు
1 min read
కృష్ణా : కృష్ణా జిల్లా కైకలూరులో టీడీపీ , వైసీపీ నాయకులు బాహాబాహికి దిగారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న బంద్ లో పాల్గొన్న ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు…ఒకరి మీద మరొకరు దాడికి దిగారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు మీరేంటే.. మీరు కారణమని విమర్శించుకున్నారు. టీడీపీ ప్లెక్సీలను వైసీపీ నాయకులు ధ్వంసం చేశారు. టీడీపీ నేత జయమంగళం వెంకటరావు మీద దాడి చేశారని ఆ పార్టీనాయకులు ఆరోపించారు. అయితే.. పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి .. పరిస్థితిని అదుపులోని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

