NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో త్వరలో 100 ‘మీ మార్ట్’లు …జాయింట్ కలెక్టర్

1 min read

భీమడోలు మండలంలో ‘మీ మార్ట్’ ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

అధికారులు,ప్రజలతో అవగాహన కార్యక్రమం నిర్వహించిన జేసీ

ప్రజలకు అవసరమైన అన్ని నిత్యావసర సరుకులు నాణ్యమైనవి,తక్కువ ధరకే లభిస్తాయి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లాలో త్వరలో 100  ‘మీ మార్ట్’ లు ఏర్పాటు చేయనున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ చెప్పారు.  భీమడోలు మండలం ఎం.ఎం. పురంలో  ‘మీ మార్ట్’ ఏర్పాటు పనులను జేసీ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ జిల్లాలోని రేషన్ దుకాణాలను  కార్పొరేట్ మార్ట్ లకు ధీటుగా “మీ మార్ట్” లుగా తీర్చిదిద్దుతామని, ముందుగా జిల్లాలోని విశాల ప్రాంగణాలు కలిగిన 100 రేషన్ దుకాణాలను గుర్తించి ‘మీ మార్ట్’ లు ఏర్పాటు చేస్తామన్నారు. ‘మీ మార్ట్’  లలో ప్రజలకు అవసరమైన అన్ని నిత్యావసర సరుకులు నాణ్యమైనవి, తక్కువ ధరకే లభిస్తాయన్నారు.    ‘మీ మార్ట్’ లలో లభించే నిత్యావసర సరుకుల నాణ్యతపై ప్రజలకు అవగాహన కలిగించాలని జేసీ అధికారులకు సూచించారు . ఈ సందర్భంగా  ‘మీ మార్ట్’ ఏర్పాటు గురించి ప్రజలకు తెలియజేసి, వారి నుండి సూచనలను జేసీ అడిగి తెలుసుకున్నారు.జేసీ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి బాబు విలియమ్స్, భీమడోలు తహసీల్దార్ రమాదేవి, రెవిన్యూ, పౌర సరఫరాల శాఖ  సిబ్బంది, పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *