మధ్యవర్తిత్వం పై న్యాయవాదులకు 40 గంటల శిక్షణ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు 19-01-2026 నుండి 23-01-2026 వరకు కర్నూలు,నంద్యాల జిల్లాల న్యాయవాదులకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటి కార్యాలయ భవనం లో జరిగిన శిక్షణ కార్యక్రమము ముగింపు కార్యక్రమానికి ముఖ్య అధితిగా ఒకటవ అదనపు జిల్లా జడ్జి పి. కమలాదేవి మరియు శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ హాజరయ్యారు . ఈ సంధర్భంగా ఒకటవ అదనపు జిల్లా జడ్జి మాట్లడుతూ సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం హైకోర్ట్ అన్నీ జిల్లా కోర్టుల్లో మధ్యవర్తిత్వం ప్రవేశ పెట్టాలని తీర్మానించింది అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 19 నుంచి 24 వరకు (భావన & మధ్యవర్తిత్వం యొక్క సాంకేతికతలు) మధ్యవర్తిత్వంలను యే విధంగా చేయాలి అని న్యాయవాదులకు అవగాహన కల్పించా మన్నారు. చెన్నై నుండి వచ్చిన మధ్యవర్తిత్వం శిక్షణ సిబ్భంది శశి దేవి మరియు రత్నతార న్యాయమధ్యవర్తిత్యం పై వాదులకు శిక్షణ ఇచ్చారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి గారు మాట్లాడుతూ వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 89 క్రింద పరిగణించేదే మధ్యవర్తిత్వం అని తెలిపారు. దీనివల్ల కోర్ట్ లో కేసులు విచారణ వరకు వెళ్లకుండా పరిష్కరించు కోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమములో కర్నూలు,నంద్యాల జిల్లాల న్యాయవాదులు, సామాజిక సేవ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

