స్వాతంత్ర్య పోరాట దృవతార సుభాష్ చంద్రబోస్
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు : భారతదేశ స్వతంత్ర పోరాటసంగ్రామంలో సుభాష్ చంద్రబోస్ ఒక ధ్రువతారగా ఎస్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్టియు ప్రాంతీయ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి ఉత్సవాలను జరిపారు. ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సుభాష్ చంద్రబోస్ తన చిన్ననాటి తనం నుండే దేశభక్తి భావాన్ని కలిగి ఉండేవారు. బ్రిటిష్ కాలం నాటి ఐసిఎస్ ( ICS) పరీక్షలో నాలుగవ ర్యాంకు లో ఉత్తీర్ణత సాధించి కూడా బ్రిటిష్ వారికి పనిచేయడం ఇష్టం లేక అత్యున్నత పదవికి రాజీనామా చేశారని చంద్రశేఖర్ తెలిపారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ తో కలిసి పనిచేసి, సైదాంతిక విభేదాలతో ‘ఫార్వర్డ్ బ్లాక్ ‘( వామపక్ష భావం) అనే పార్టీని స్థాపించారు. ‘ ఆజాద్ హింద్ ఫౌజ్ ‘ ( INA) ను స్థాపించి సాయుధ పోరాటంతోనే స్వతంత్రం వస్తుందని ఆకాంక్షించారని పేర్కొన్నారు. నేతాజీ సామ్యవాద భావాన్ని ఆయన బలంగా నమ్మేవారని,.’ నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తాను ‘,’ జై హింద్ ‘, ‘ చలో ఢిల్లీ’ వంటి ప్రసిద్ధ నినాదాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు జిల్లా కౌన్సిలర్లు బలరాం, చంద్రశేఖర్ రెడ్డి, ఇక్బాల్ హుస్సేన్, పత్తికొండ ఎస్ టి యు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఏ. నాగరాజ్, ఎం. మారుతి, ఆర్థిక కార్యదర్శి మండ్ల వెంకటేష్ పాల్గొన్నారు.

