NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మధ్యవర్తిత్వం పై న్యాయవాదులకు 40 గంటల శిక్షణ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు సోమవారం అనగా 19-01-2026 కర్నూలు,నంద్యాల జిల్లాల న్యాయవాదులకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటి కార్యాలయ భవనం లో మధ్యవర్తిత్వంపై  40 గంటల శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి/ జిల్లా న్యాయ సేవాది కార సంస్థ అధ్యక్షులు జి. కబర్థి గారు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం హైకోర్ట్ అన్నీ  కోర్టుల్లో మధ్యవర్తిత్వం ప్రవేశ పెట్టాలని తీర్మానించింది అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 19 నుంచి 23 వరకు (భావన & మధ్యవర్తిత్వం యొక్క సాంకేతికతలు) మధ్యవర్తిత్వంలను యే విధంగా చేయాలి అని న్యాయవాదులకు అవగాహన కల్పించనున్నారు. చెన్నై నుండి వచ్చిన మధ్యవర్తిత్వ శిక్షణ సిబ్భంది ఆర్. రత్న తార మరియు       జి. శశి దేవి మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు 40 గంటల శిక్షణను ఇస్తారని తెలిపారు. తదనంతరము జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లడుతూ   వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 89 క్రింద పరిగణించేదే మధ్యవర్తిత్వం అని తెలిపారు. దీనివల్ల కోర్ట్ లో కేసులు విచారణ వరకు వెళ్లకుండా పరిష్కరించు కోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమములో శాశ్వతంలో లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, కర్నూలు న్యాయ వాదుల సంఘము ప్రసిడెంట్ హరినాధ్ చౌదరి, కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయవాదులు పాల్గొన్నారు.

About Author