NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 58వ గ్రంథాలయ వారోత్సవాలు

1 min read

గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పెంచే దేవాలయాలు

ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా.పద్మశ్రీ 

నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బడేటి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాగ్రంథాలయసంస్థ,  ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం 58 వ  జాతీయగ్రంథాలయ వారోత్సవాలు చాలాఘనంగా ప్రారంభమైనవి వారోత్సవాల ప్రారంభవేడుకలకుజిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి   ఎమ్. శేఖర్ బాబు అధ్యక్షతవహించారు. మరియుముఖ్యఅతిథులు గా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి)  పాల్గొని జ్యోతిప్రజల్వన చేసారు.అనంతరం భారతదేశ తొలిప్రధానమంత్రిజవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శాసన సభ్యులు వారి చిత్రపఠoకు పూలమాలవేసినివాళులుఅర్పించారు. అనంతరం సభాకార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ 58 వ గ్రంథాలయ వారోత్సవాలు 74 గ్రంథాలయాల్లో ప్రారంభమయ్యాయి అని అన్నారు. మరియు ఈ సందర్భంగా ఆహ్వానితులకుజిల్లా కేంద్ర గ్రంథాలయం నూతనభవనం నిర్మాణం కొరకుతగునిధులను వేరేచోటకుమారుటకువసతి ను తగుసహాయ సహకారాలనుఅందించాలనిశాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్యకు కార్యదర్శికోరారు. మరియు మరొక్క ముఖ్యఅతిథి జిల్లాప్రజా పరిషత్ చైర్ పర్సన్  ఘంటా పద్మశ్రీ ప్రసాద్  పాల్గొన్నారు. జిల్లాప్రజా పరిషత్ చైర్ పర్సన్  మాట్లాడుతూ ఈ సందర్భంగా గ్రంథాలయాలు దేవాలయాలులాంటివి,పుస్తకాలు అలంకరణ కాకుండా జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలివిని పెంచేవి గ్రంథాలయాలు ఇలాంటి  గ్రంథాలయాలకుతరచూ రావటంఅలవాటుగా చేసుకొని మంచి విజ్ఞాన వంతులు కావాలని కోరుతున్నాను.గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకొని వస్తాము అని హామీఇచ్చారు. తొలుత కళారత్న అవార్డు గ్రహీత అయిన పార్వతీ రామచంద్రన్ శిష్యులచే చి: డి.నాగ అఖిలరెడ్డి, చి: టి.ఉమామహేశ్వరి చేత స్వాగత నృత్యసుమాంజలి జరిగింది. అనంతరంఈ సందర్భంగా శాసనసభ్యులుముందుగా విద్యార్థులకుబాలల దినోత్సవంశుభాకాంక్షలు తెలియజేస్తూగ్రంథాలయాలకు వచ్చివిజ్ఞానం పెంపొందించుకోండి మరియు విద్యార్థులకు చరిత్ర గురించితెలియాలంటే సెల్ ఫోన్ చూడండి చరిత్ర తిరిగి రాయాలంటే గ్రంథాలయాలకు వచ్చి పుస్తకాలుచదవండిఅని విలువైనసూచనలను తెలిపారు. ఈ సభావేదిక ను వ్యాఖ్యాతగా పాల్గొని ఆర్.విజయ్ కుమార్ వయోజనవిద్యా అసిస్టెంట్ ప్రాజెక్ట్ఆఫీసర్ నిర్వహణ చేశారు. అనంతరం సోషల్ వర్కర్ & చలసాని వెంకటసురేంద్ర (పెప్సీ) చిన్నారులకు,విద్యార్థులకు, అలరించడానికి “వెంట్రిలాక్విజం” మాట్లాడేబొమ్మతోఒక వినూత్నమైన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వయోజన విద్యా ఉప సంచాలకులు  జి.సిహెచ్ . ప్రభాకర్, నగర ప్రముఖులు, చోడే వెంకట రత్నం మరియు ప్రజా ప్రతినిధులు, శ్రీసూర్య విద్యా సంస్థ డైరెక్టర్  కొండపల్లి. చంద్రశేఖర్ రావు, సీనియర్ అసిస్టెంట్  ఎల్. వెంకటేశ్వర రావు, అసిస్టెంట్ లైబ్రేరియన్ వీటి సందీప్ కుమార్, జిల్లాకేంద్ర గ్రంథాలయంసిబ్బంది, కార్యాలయం సిబ్బంది. వివిధ పాఠశాలల విద్యార్థులు 150 మంది మరియు పాఠశాల ఉపాధ్యాయులు, మీడియా ప్రతినిధులు, పాఠకులు, పాల్గొని వారోత్సవాల ప్రారంభ వేడుకలనుసభను ఘనంగా నిర్వహించారు.

About Author