NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో పీ-4 కార్యక్రమం ద్వారా 65 శాతం బంగారు కుటుంబాల వెరిఫికేషన్

1 min read

వివిధ అంశాలు ప్రగతిని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, రాష్ట్ర ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి పీయుష్ కుమార్ కు వివరించారు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: బుధవారం అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ పియూస్ కుమార్ జిల్లా కలెక్టర్లు జిల్లా ఆర్థిక గణాంక అధికారులు సంక్షేమ శాఖలు, విజన్ యాక్షన్ ప్లాన్ అధికారులు, యంగ్ ప్రొఫెషనలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రభుత్వ దాతలు ప్రజల భాగస్వామ్యం పీ-4, పెర్ఫార్మన్స్ ఇండికేటర్స్, పిజిఆర్ఎస్ అర్జీలు పరిష్కారాలు, అభివృద్ధి ప్రాజెక్టులపై జిల్లాలు వారీగా పురోగతిపై సమీక్షించారు. స్థానిక కలెక్టరేటు నుంచి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, సంబంధిత జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు పీ-4 కార్యక్రమం ద్వారా 65 శాతం బంగారు కుటుంబాలను వెరిఫికేషన్ చేయడం జరిగిందన్నారు. రెండు, మూడు రోజుల్లో  పీ-4 బంగారు కుటుంబాలు వెరిఫికేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చెయ్యడం జరుగుతుందని వివరించారు. జిల్లాలో పీ-4 కార్యక్రమంపై జిల్లా స్థాయి అవగాహనతో కూడిన శిక్షణా కార్యక్రమాలు  నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో  విజన్ యూనిట్స్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.మిగతా 28,096 కుటుంబాలకు దత్తత తీసుకునే కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ లో ఐటిడిఏ పీవో కె.రాములు నాయక్, ఇన్చార్జి సిపివో బి.శ్రీదేవి, జిల్లా పరిషత్తు సిఇవో యం.శ్రీహరి, డిఆర్డీఏ పిడి టి.వి.విజయలక్ష్మి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె. షాజా నాయక్, సంబంధిత శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author