కూటమి ప్రభుత్వం తోనే రాష్ట్ర అభివృద్ధి
1 min read

టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి
న్యూస్ నేడు పత్తికొండ : రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ అట్లా ప్రమోద్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం కమిటీ సభ్యురాలిగా ఎంపికైన ఉప్పర వరలక్ష్మి తో పాటు ఉప్పర సంఘం సభ్యులు కలిసి టిడిపి నేతలు సాంబశివారెడ్డి, ప్రమోద్ కుమార్ రెడ్డిలను పూలమాలలు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అందరి సమన్యాయం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని చూసి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని, ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని వివరించారు. అనంతరం కౌతాళం మండలం, ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం కమిటీ సభ్యురాలు ఉప్పర వరలక్ష్మి మాట్లాడుతూ… ప్రముఖ పుణ్యక్షేత్రం యందు సభ్యురాలిగా నన్ను ఎంపిక చేసినందుకు మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ.శ్యామ్ కుమార్, టిడిపి నేతలు సాంబశివారెడ్డి, ప్రమోద్ కుమార్ రెడ్డిలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ ఉప్పర సంఘం అధ్యక్షులు ఎస్. యు. వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బాలప్ప, గౌరవ సలహాదారులు నరసింహమూర్తి, సభ్యులు వెంకటేశ్వర్లు, నరసింహులు, తిమ్మప్ప, రవి, రామాంజనేయులు, వెంకటేశ్వర్లు, నాగరాజు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

