NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా 77వ గణతంత్ర  దినోత్సవ వేడుకలు

1 min read

మచిలీపట్నం, న్యూస్​ నేడు   : దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్న నేపథ్యంలో, మచిలీపట్నంలోని పోలీస్ గ్రౌండ్స్ లో కృష్ణా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో  77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు లో పాల్గొన్న  కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ  డి సి ఎం ఎస్ చైర్మన్ బండి రామకృష్ణ రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామా ప్రసాద్ గౌడ్ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పిత గోపీచంద్ నూర్ భాషాల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ బాలాజీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు వెలగపూడి శంకర్ బాబు సగర కార్పొరేషన్ డైరెక్టర్ తాడిశెట్టి వీరాస్వామి లంకె నారాయణ ప్రసాద్ లు హాజరైనారు.  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,హాజరైన అధికారులు, సిబ్బంది సమూహంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం గౌరవ వందనం నిర్వహించబడింది. ప్రదర్శనగా వచ్చిన శఖటాలను తిలకించారు. జాతీయ జెండా రెపరెపలాడుతుండగా ప్రాంగణమంతా దేశభక్తి నినాదాలతో మార్మోగింది. డిసెంబర్ 11న జరిగిన సమావేశంలో డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, న్యాయ కోవిదులైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి రాజ్యాంగ ముసాయిదా తయారీ బాధ్యత అప్పగించారని తెలిపారుసువిశాల భారత రాజ్యాంగం రచించిన రోజు జనవరి 26 అని, చట్టపరంగా జనవరి 26 నుండి అమలులోకి రావడం భారతదేశ ప్రజల అదృష్టంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ లు మరియు డైరెక్టర్లు మచిలీపట్నం పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి బత్తిన దాసు నాయకులు అధికారులు పాల్గొన్నారు.

About Author