NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా అవార్డును అందుకున్న వి.సుధాకర్ రెడ్డి

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండల తాహశిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న  వి. సుధాకర్ రెడ్డి  సోమవారం 77 వ  గణతంత్ర దినోత్సవం వేడుకల్లో   నంద్యాల  జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా వి.సుధకర్ రెడ్డి అవార్డును అందుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉత్తమ అవార్డు నాకు  రావాటం నాకు ఎంతో సంతోషంగా ఉందని,తమ విధులను సక్రమంగా నిర్వహించుకోవడం, ప్రజలకు సేవలు అందిస్తూ, నా పై అధికారుల పట్ల గౌరంతో ,విధుల పట్ల తారతమ్యం లేకుండా తమ తోటి సిబ్బందికి అనుకూలంగా కలిసిమెలిసిగా ఉండటం వల్లన,తామ కార్యాలయం సిబ్బంది సహకారంతోనే ఈరోజు ఈ అవార్డు అందుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ అవార్డు అందుకున్నసీనియర్ అసిస్టెంట్ వి. సుధాకర్ రెడ్డిని తాసిల్దార్ సిబ్బంది, మిత్రులు, శ్రేయాభిలాషులు అభినందించారు.

About Author