NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చింతలపూడి మండలంలో 79.23 శాతం పోలింగ్

1 min read

41,333 మంది ఓటర్ల ఓటు హక్కు వినియోగించుకున్నారు

రిటర్నింగ్ అధికారి (ఆర్వో) వై.సుబ్బారావు 

ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: మండలంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 79.23 శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి (ఆర్వో) వై.సుబ్బారావు తెలిపారు. మండలవ్యాప్తంగా మొత్తం 41,333 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు. వీరిలో 20,583 మంది పురుష ఓటర్లు, 20,750 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు వివరించారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించు కున్నారని ఆర్వో వై. సుబ్బారావు  తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *