తంగేళ్ల మూడి పునీత జోజప్ప పరిశుద్ధదేవాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
1 min read
దేశం మనకేం చేసిందన్నది ముఖ్యం కాదు,దేశానికి మనం ఏమి చేశామన్నదే ప్రాముఖ్యం
విచారణ గురువులు రెవ, ఫాదర్:తోట అంతోని రాజు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక తంగేళ్ల మూడి పునీత జోజప్ప పరిశుద్ధ(ఆర్ సియం)దేవాలయంలో పరిశుద్ధ దివ్య బలిపూజ మరియ తల్లి మోక్షారోహారణ పండుగ మరియు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు విచారణ కర్తలు రెవ.ఫాదర్:తోట అంతోని రాజు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ మాట్లాడుతూ ఎందరో త్యాగ మూర్తులు త్యాగఫలమే నేడు మనం జరుపుకునే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అన్నారు. ముఖ్యంగా దేశం మనకేమి చేసిందన్నది ముఖ్యం కాదని,దేశానికి మనం ఏం చేశామన్నదే ప్రాముఖ్యమని,మనమంతా శాంతి సామరస్యాలతో కలిసిమెలిసి జీవించాలన్నరు. కార్యక్రమంలో సిస్టర్స్,బ్రదర్స్, సంఘ పెద్దలు,మరియదళ సభ్యులు మరియు యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


