NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోలీస్ ఫెరెడ్ గ్రౌండులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

1 min read

ప్రభుత్వ వివిధ శాఖలు జిల్లా ప్రగతిపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తిలకించిన మంత్రి కొలుసు  పార్థసారథి, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

ఏలూరు జిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: స్థానిక పోలీసు పోలీస్ ఫెరెడ్ గ్రౌండులో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖలు ఆధ్వర్యంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రత్యేక స్టాల్స్ మరియు ప్రదర్శనలను,రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, ఏపి వడ్డి కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ,అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి పి.వి.సంధీప్ రెడ్డిలు తిలకించారు. జిల్లా పంచాయతీ శాఖ.అగిరిపల్లి, ద్వారకాతిరుమల, బుట్టాయగూడెం గ్రామాల్లో  ‘స్వచ్ఛరథం’ నుండి వ్యర్థ ప్లాస్టిక్‌ను సేకరించడానికి ఏర్పాటు చేసిన పి.డబ్ల్యూ.ఎం.యు (PWMU) ప్లాస్టిక్ వ్యర్థాలు నిర్వహణ యూనిట్లను వర్చువల్‌గా మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 27 స్వచ్ఛరథాలు నడుస్తున్నాయని, భవిష్యత్తులో వ్యర్థ ప్లాస్టిక్ సేకరణ ఆధారంగా మరిన్ని స్వచ్ఛరథాలను ఏర్పాటు తీసుకోవచ్చునని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి యం.శ్రీదేవి, జెడ్పీ సిఈవో పి.జగదాంబ, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఎల్.దేవకీదేవి, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, వివిధ శాఖలు అధికారులు, లబ్ధిదారులు, డ్వాక్రా మహిళలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *