NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో భారత్ బంద్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: భారతదేశానికి శూద్ర కులాలు  రక్తనాళాల వంటి వారని మహాత్మా పూలే మాటలను నిజం చేయాలంటే ఓబీసీ కులగణనతోపాటు అన్ని కులాల గణన జరగాలని, ఎస్సీ ఎస్టీ బీసీలకు రక్షణ కవచం  లాంటి యూజిసి చట్టం అమలు చేయాలని, 2011 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్​ నుండి మినహాయింపు నివ్వాలని, రాజ్యాంగ, ప్రజాస్వామ్య విరుద్ధమైన ఈవిఎం లను రద్దు చేయాలని భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో 23-04-2026 గురువారం నిర్వహిస్తున్న బంద్ సందర్భంగా మహాత్మ పూలే సర్కిల్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దేశం అభివృద్ధి పథంలో కుల గణన  తక్షణం నిర్వహించాలని బీసీ సంఘ నాయకులు నక్కల మిట్ట శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అధికారికంగా 1932లో బ్రిటిష్ వాళ్ళు కుల గణన చేయడం జరిగింది. అదేవిధంగా 1941లో చేసిన కులగనన రెండో ప్రపంచ యుద్ధం కారణంగా వెలుగులోకి రాలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా కుల గణన చేయకుండా ఓబీసీ లకు సరిదిద్దుకోలేని  అన్యాయం చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో కుల గణన ఓబీసీ ల ఆర్థిక, సామాజిక, రాజకీయ వెనుకు పాటుతనాన్ని స్పష్టం చేస్తున్నందున, దేశవ్యాప్తంగా ఓబీసీ కుల గణన జరిగితే జరగబోయే పరిణామాలను ఎదుర్కోలేని ప్రభుత్వాలు ఓబీసీ కుల గణన చేయకుండా, ప్రస్తుతం నిర్వహిస్తున్న జనాభా లెక్కల్లో కూడా   ఎస్సీ , ఎస్టీ మరియు ఇతరులు అనే కాలం ఉంచి ఓబీసీ కుల గణన జరగకుండా అడ్డుకుంటూ ఓబీసీ లను నిర్లక్ష్యం చేస్తున్నాయని  జాతీయ ఓబీసీ మోర్చా కో కన్వీనర్ డాక్టర్ కంచర్ల హరిప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు శేషపణి,రామశేషయ్య,ఆర్టిఐ జయన్న, ఇక్బాల్ బాషా, రంగస్వామి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *