NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే సేవా-గ్రేనేటెడ్  సంస్థ లక్ష్యం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: రైతులు ఆర్థికంగా స్థిరపడాలనదే లక్ష్యంతో సేవా-గ్రేనేటెడ్  సంస్థ  కర్నులు మరియు నంద్యాల జిల్లా రైతుల కోసం సహాయ సహకారాలు అందిస్తుంది.వాతావరణం కాలుష్యం పరి జ్ఞానంలో ఉంచుకొని సకాలంలో వర్షాలు కురిసేందుకు గాను చెట్ల పెంపకం ఎంతో రైతన్నల పాడిపంటలకు తోడుపడుతుంది .దేశానికి వెన్నెముకలు రైతన్న లే, రైతన్నలు గ్రామాల్లో సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు. అందుకు అనుగునంగా రైతులకు జీవనాధారంగా పండ్ల తోటల పెంపకము కోసం చీని, మామిడి, నేరేడు, కొబ్బరి, నిమ్మ, దానిమ్మ తదితర పండ్ల తోటల పెంపకానికై సేవా-గ్రేనేటెడ్ సంస్థ రైతులకు ఆర్థిక సహయపడుటకు ముందుకు వచ్చింది. ఒక సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల వయసుగల చెట్లకు 20 సంవత్సరాలపాటు ఆర్థిక సహాయము రైతుకు అందించబడుతుందని సేవా-గ్రేనేటెడ్ సంస్థ తెలియజేసింది.కనుక కర్నూలు, నంద్యాల జిల్లా రై తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలి వారు కోరారు. పూర్తి వివరాలకై  7019583550నెంబరును సంప్రదించగలరు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *