NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

65 లక్షల నిధులతో నిర్మించిన రోడ్డుని ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్

1 min read

స్వాతంత్రం వచ్చిన ఇంతవరకు నిర్మించిన రోడ్లును నిర్మించడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు.

పెనమలూరు, న్యూస్​ నేడు: నియోజకవర్గం, కంకిపాడు మండలంలో గంగూరు సరిహద్దు నుంచి వేల్పూరు లక్ష్మీపురం వరకు ఎన్ఆర్జిఎస్ నిధులు 65 లక్షలతో నూతనంగా నిర్మించిన రోడ్డుని శాసనసభ్యులు బోడె ప్రసాద్ ప్రారంభించారు.ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచిన, ప్రభుత్వాలు మారిన ఇంతవరకు గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లను నిర్మించలేదు కూటమీ ప్రభుత్వంలో కనెక్టివిటీ రోడ్లు నిర్మించడం సంతోషంగా ఉందన్నారు.విజయవాడ కి అతి సమీపంలో ఉన్న గంగూరు, వేల్పూరు గ్రామాలను కలిపే కనెక్టివిటీ రోడ్డు ని నిర్మించడం గర్వంగా ఉందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణ పనులు చేపట్టిన, పూర్తిస్థాయిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేశామన్నారు.వేల్పూర్ గ్రామంలో ఎమర్జెన్సీలో అంబులెన్ లో హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాలన్న సరైన సౌకర్యాలు లేవు, చిన్న వంతెన ద్వారా గ్రామం నుంచి ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి.  ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం వలన తో 10 నిమిషాల్లో పోరంకులో ఉన్న  హాస్పటల్ కి వెళ్ళవచ్చు అన్నారు.లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డుని, గ్రామస్తులు, రైతులు కాపాడుకోవాలని అన్నారు. ముఖ్యంగా దమ్ము చక్రాలకు బద్దీలను నిర్మించి రోడ్లపై వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.పెనమలూరునియోజకవర్గంలో, అన్ని గ్రామాలను సమంతరంగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెనమలూరు మండల పార్టీ అధ్యక్షులు కోయ ఆనంద ప్రసాద్ నేరుసు రాజ్యలక్ష్మి  తుమ్మలపల్లి హరికృష్ణ అనే ధనరామ కోటేశ్వరరావు చిల్లి అజయ్ సంగేపు రంగారావు జపన వెంకటేశ్వరరావు అబ్దుల్ ప్యారీ లతీఫ్ చలసాని వెంకటేశ్వరరావు ఏ కుల విజయేంద్ర జడ వెంకటేశ్వరరావు పండుల రజిని కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author