NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గరుకు స్తంభాల ఏర్పాటు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు నగరంలోని  శ్రీసూర్య నారాయణ స్వామి దేవాలయ గోశాలలో  మంగళవారం ‘గరుకు స్తంభాల’ ఏర్పాటు కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో  వైభవంగా  నిర్వహించారు. దాతల ఆర్థిక సహకారంతో, ఆలయ కమిటీ పర్యవేక్షణలో ఈ పుణ్యకార్యం దిగ్విజయంగా పూర్తయింది.  పవిత్ర కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గోమాతలను దర్శించుకున్నారు. అనంతరం విచ్చేసిన భక్తులందరూ భక్తితో తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *