NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిడుతూరు’లో చలివేంద్రం ప్రారంభం

1 min read

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో మంగళవారం ఉదయం అధికారులు చలివేంద్రాన్ని ప్రారంభించారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి దశరథ రామయ్య, టీడీపీ మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి ప్రారంభించారు.ఎండలు అధిక ఉష్ణోగ్రత వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల కోసం దాహం తీర్చాలనే ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సంజన్న, పంచాయతీ కార్యదర్శి చాందిని,లక్ష్మీనారాయణ, నారాయణ,శీను పాల్గొన్నారు.

About Author