35లక్షల రూ. నిధులతో సిసి రహదారుల నిర్మాణ పనులు
1 min read
జవాబుదారీ పాలనకు పారదర్శక విధానాలు తోడైనప్పుడే సంపూర్ణ ప్రజామోదం లభిస్తోంది
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జవాబుదారీ పాలనకు పారదర్శక విధానాలు తోడైనప్పుడే సంపూర్ణ ప్రజామోదం లభిస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ప్రజాభీష్టాలు నెరవేర్చే లక్ష్యంతో జనరంజక పాలనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, తిరుగులేని రికార్డులతో దూసుకెళ్తోందని ఆయన స్పష్టం చేశారు. ఏలూరు 4, 5 డివిజన్ల పరిధిలో 35లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తోన్న సిసి రహదారుల నిర్మాణ పనులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మంగళవారం పరిశీలించారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం నిర్మాణ దశలో ఉన్న రోడ్డును, నిర్మాణం పూర్తైన రోడ్డును పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఇదేసమయంలో ఎన్నో ఏళ్ళ కలను సాకారం చేసేందుకు కృషిచేసిన ఎమ్మెల్యే బడేటి చంటిని ప్రజలు తమ అభిమాన పూర్వక కృతజ్ఞతలతో ముంచెత్తారు. అలాగే స్థానిక ప్రజలను అడిగి వారి సమస్యలను కూడా తెలుసుకున్న ఎమ్మెల్యే చంటి పరిష్కార చర్యలు చేపడతానంటూ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గతంలో తాను పాదయాత్ర చేసిన సమయంలో తెలుసుకున్న ప్రతి సమస్యకు ప్రాధాన్యతా క్రమంలో పరిష్కార మార్గాలు చూపుతూ వస్తున్నట్లు చెప్పారు.కార్యక్రమంలో మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, సెక్రటరీ రెడ్డి నాగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జి అమరావతి అశోక్, డివిజన్ ఇన్ఛార్జ్ రేవులగడ్డ లాలా లజపతిరాయ్, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, బిజెపి నగర అధ్యక్షులు గాది రాంబాబు, నాయకులు బొద్దాని శ్రీనివాస్, రెడ్డి ఈశ్వరరావు, జాలా బాలాజీ, జిలాని, దొడ్డికర్ల శుభ మల్లిక్, బి మాణిక్యం, సిరి శెట్టి నారాయణ ప్రసాద్, కార్పొరేటర్లు పాము శామ్యూల్, సబ్బన శ్రీనివాసరావు, జనసేన నాయకులు రెడ్డి గౌరీ శంకర్, ఉమా తదితరులు పాల్గొన్నారు.

