NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వరిగడ్డి వాములకు దుండగుల నిప్పు..

1 min read

రైతుకు 70 వేల నష్టం..

మిడుతూరు నందికొట్కూరు (న్యూస్ నేడు): వరి గడ్డి వాములకు దుండగులు నిప్పు పెట్టడంతో పశువుల మేత బూడిద పాలు అయిన సంఘటన మిడుతూరు మండలంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని వీపనగండ్ల గ్రామంలో రైతు కురువ శివశంకర్ కు చెందిన వరిగడ్డి వాములను మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. తెల్లారేసరికి వరిగడ్డివాములు బూడిద అయ్యాయి.గ్రామస్తులు ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ మంటలను అదుపులో చేశాయి.రైతు శివశంకర్ కు 70 వేలు నష్టం వాటిల్లినట్లు రైతు శివశంకర్ తెలిపారు.పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

About Author