NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రేపే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం

1 min read

మే 2 వరకు బ్రహ్మోత్సవాలు

ఆలయ కార్య నిర్వహణాధికారి లక్ష్మీనారాయణ..

మిడుతూరు న్యూస్ నేడు: బుధవారం నుండి మే నెల రెండవ తేదీ వరకు ఈ తిరుణాల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి యు లక్ష్మీనారాయణ అన్నారు.రేపే శ్రీ లక్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవంరేపు శుక్రవారం సాయంత్రం 5:30 కు మిడుతూరు గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో లక్ష్మీనారాయణ అన్నారు.మే 1వ తేదీ శుక్రవారం ఉదయం వ్రతంగా హోమం,పూర్ణాహుతి సాయంత్రం భక్తుల మధ్య  రథోత్సవ కార్యక్రమం జరుగును.రెండవ తేదీ ఉదయం తీర్ధావళి వసంతోత్సవం,సాయంత్రం ఐదు గంటలకు పారువేట.. ఈనెల 30 నుండి మే రెండు వరకు ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అదేవిధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో లక్ష్మీనారాయణ తెలిపారు.

క్రికెట్ పోటీలకు 35 జట్లు

తిరుణాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో 35 జట్లు పాల్గొంటున్నాయి.జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి.ఒకటవ తేదీ రాత్రి కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయి.ఈ పండుగ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు అధికారులు సహకరించాలని ఆలయ ఈవో కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *