రాజకీయాలు కాదు..షాధీ ఖానాను పూర్తి చేయండి
1 min read
షాదిఖాన ప్రారంభంలో జాప్యం -వైఎస్ఆర్సీపీ ఇన్చార్జి డాక్టర్ సుదీర్..
నందికొట్కూరు న్యూస్ నేడు: నందికొట్కూరులో రాజకీయాలకు అతీతంగా షాదిఖానాను పూర్తి చేసి ప్రారంభించాలని నందికొట్కూరు వైఎస్ఆర్సిపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ డిమాండ్ చేశారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం ఆత్మకూరు రోడ్ బైరెడ్డి శేషశయానా రెడ్డి నగర్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 1.50 కోట్లతో పూర్తి చేసిన షాదిఖాన నూతన భవనాన్ని డా.సుదీర్ మంగళవారం ఉదయం పరిశీలించారు.ఈ సందర్భంగా డాక్టర్ సుదీర్ మాట్లాడుతూషాదిఖాన నిర్మాణాన్నికి 1998 లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి స్పీకర్ ఎన్ఎం డీ ఫరూక్ శిలాఫలకం వేసి గాలికి వదిలేశారు.2014 లో రెండో శిలాఫలకం కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసి వదిలేశారు.2019 లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక కోటి యాభై లక్షలతో షాదిఖాన పూర్తి చేశారు.పూర్తి చేసిన షాదిఖానాను ప్రారంభించకుండా ఇక్కడున్న ఎంపీ,ఎమ్మెల్యే ఏమి చేస్తున్నారని మండిపడ్డారు.ముస్లిం మైనారిటీలకు పేద ప్రజలకు అందుబాటులో ఉండేందుకు భవనాన్ని ప్రారంభించాలి.కమిటీల పేరుతో షాదిఖాన భవనాన్ని ప్రారంభించకుండా ముస్లిం మైనార్టీలకు టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.ఇప్పటికైనా ఎంపీ,ఎమ్మెల్యే స్పందించి షాదిఖానాను ప్రారంభించాలని లేని పక్షంలో మైనార్టీలకు అండగా ఉంటూ పోరాటం చేస్తామని డాక్టర్ సుధీర్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మన్సూర్, జబ్బార్,వైయస్సార్ టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోమిన్ మన్సూర్,మాజీ కౌన్సిలర్ నాయక్,వలి, ఉపేంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


