NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

135 వ ఆత్మబంధు అంత్యక్రియలు నిర్వహించిన ద్రోణాచలం సేవా సమితి

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ సమీపంలో దొరపల్లె బ్రిడ్జ్ సమీపంలో సుమారు 75 సంవత్సరాల అనాధ వృద్ధుడు అనారోగ్యంతో చనిపోగా అతని మృతదేహన్ని డోన్ రైల్వే జిఆర్పీ పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి తనకు ఎవరూ లేరు అతని అంత్యక్రియలు నిర్వహించండి అని ద్రోణాచలం సేవాసమితి వారిని కోరగా స్పందించిన సేవా సైనికులు ఆతని మృతదేహాన్ని తీసుకొని డోన్ హిందూ స్మశాన వాటికలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఆతని అంత్యక్రియలు నిర్వహించారు .ఈ పుణ్య కార్యక్రమానికి ఆయన ఖర్చును అన్నా రెస్టారెంట్,నంద్యాల యజమాని డేరెడ్డి శేషారెడ్డ భరించారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచలం సేవా సైనికులు షాదిఖానా రాజా,తాహెర్ బాషా, ఫోటోగ్రాఫర్ బాబా, షబ్బీర్, ఆటో చిన్న మధు, నరేష్ మరియు రైల్వే జిఆర్పీ కానిస్టేబుల్ రామానాయుడు లు పాల్గొన్నారు.

About Author