NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన నవగ్రహ విగ్రహ ప్రాణ ప్రతిష్ట

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  లక్ష్మీపురం గ్రామ సమీపంలో, జగన్నాథ గట్టుకు వెళ్లే మార్గంలో, రిడ్జ్ స్కూల్ సమీపంలోని శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర సపరివార సమేత ఆదిత్యాది నూతన నవగ్రహ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం గత రెండు రోజులుగా వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగుతోంది.ఈ మహోత్సవంలో భాగంగా రేపు గురువారం ఉదయం 10:22 నుండి 10:40 గంటల మధ్య యంత్ర ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, బలి ప్రదానం, మహా పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మార్జనం, దేవతామూర్తుల అలంకరణ అనంతరం ప్రధమ దర్శనం, మహా మంగళహారతి, మంత్రపుష్పం, వేద ఆశీర్వచనం, తీర్థప్రసాద విహరణ కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.ఈ కార్యక్రమాన్ని జి. పుల్లయ్య  మరియు కుటుంబ సభ్యులు, రవీంద్ర ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ ఉమామహేశ్వర, రామాంజనేయ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు.

About Author