ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సిపిడిసి సమావేశం
1 min read
ప్రిన్సిపల్ డాక్టర్ గుత్తా గిరిబాబు అధ్యక్షతన కార్యక్రమం
డాక్టర్ డి.సుబ్బారావు 2026-27 సంవత్సరానికి గాను లయన్స్ జిల్లా గవర్నర్ గా నియామకం
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం మధ్యాహ్నం కళాశాల సీపీడీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గుత్తా గిరిబాబు అధ్యక్షత వహించి గత రెండు నెలలుగా కళాశాలలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సిపిడిసి సభ్యులకు వివరించారు. సిపిడిసి సభ్యులు కేకే గుప్తా కళాశాల కంప్యూటర్ ల్యాబ్ కు అవసరమైన రెండు ఏసీలు బహుకరించి,బుధవారం వాటిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వారిని ఘనంగా సత్కరించారు.మరొక సీపీడీసీ సభ్యులు డాక్టర్ డి.సుబ్బారావు 2026-27 సంవత్సరానికి గాను లయన్స్ జిల్లా గవర్నర్ గా నియమితులైన సందర్భంగా ప్రిన్సిపల్ మరియు సి పి డి సి సభ్యులు వారిని సత్కరించారు. కార్యక్రమంలో సిపిడిసి కార్యదర్శి ఎల్.వెంకటేశ్వరరావు,బడేటి వెంకట్రామయ్య,వి.వెంకట్రావు,ఎం. కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

