‘ పది ‘ లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం
1 min read
600 కు 598 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన ఇద్దరు విద్యారులు
అభినందించిన ఎంజీఎం సురేష్, ఐ.కోటయ్య చౌదరి
కర్నూలు, న్యూస్ నేడు: 2025-26 పదవ తరగతి పరీక్ష ఫలితాలలో నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించాయని ఆ విద్యా సంస్థల ఎంజీఎం సురేష్ మరియు ఆర్. ఐ. కోటయ్య చౌదరి తెలిపారు. గురువారం నగరంలోని పాత అయ్యప్పస్వామి గుడి పక్కన ఉన్న శ్రీ చైతన్య స్కూల్ లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఏజీఎం పాల్గొని ప్రసంగించారు. 2025-2026లో మొత్తం 600 మార్కులకు గాను 598 మార్కులు ఇద్దరు, 597 ఇద్దరు, 596 ఇద్దరు, 595 ఇద్దరు, 594 ఒక్కరు, 593 నలుగురు, 592 ఐదుగురు, 591 మార్కులు నలుగురు సాధించారన్నారు. 590 పైన మార్కులు 31 మంది, 580 పైన మార్కులు 113 మంది, 570 పైన మార్కులు 186 మంది, 560 పైన మార్కులు 271 మంది, 550 పైన మార్కులు 338 మంది, 500 పైన మార్కులు 621 మంది విద్యార్థులు మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారని ఆయన తెలిపారు. ఇంతటి అద్భుతమైన ఫలితాలను సాధించుటకు కారణం ఉత్తమ శిక్షణతో పాటు మారుతున్న విద్యా వ్యవస్థకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలను రూపొందించి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు కూడ సులువుగా అర్థమయ్యేటట్లు బోధించడమేనని చెప్పారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను అభినందిస్తూ ప్రోత్సహించిన తల్లి దండ్రులకు, కృషి చేసిన ప్రిన్సిపాల్ లకు, కోఆర్డినేటర్స్ కు, డీన్స్ కు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి శ్రీచైతన్య స్కూల్ కర్నూలు మరియు నంద్యాల జిల్లాల ఎంజీఎం సురేష్ మరియు ఆర్.ఐ. కోటయ్య చౌదరి కృతజ్ఞతలు తెలిపారు.

