మే10 నుండి 16 వరకు 7 రోజులు హనుమద్ జయంతి మహోత్సవాలు
1 min read
ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి. చందన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరుజిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానం నందు ది.10.05.2026 నుండి ది.16.05.2026 వరకు 7 రోజులు హనుమద్ జయంతి మహోత్సవములు సందర్భముగా దేవస్థానం చుట్టూ పందిర్లు మరియు విద్యుత్ అలంకరణలు మొదలైన ఉత్సవ ఏర్పాట్లు చేయుటకు ఈ రోజు ఉదయం గం.10.12 ని.లకు ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్ వి. చందన వారిచే పందిరి రాట ముహూర్తం చేసియున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆలయ సూపరింటెండెంట్ కె.రంగారావు పాల్గొనినారు.

