NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా

1 min read

మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా కార్యాల‌యంలో ఘ‌నంగా కార్యక‌ర్తల పుట్టిన‌రోజు సంబ‌రాలు

కర్నూలు, న్యూస్​ నేడు:  రాష్ట్ర ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కార్యక‌ర్తల పుట్టినరోజు వేడుక‌ల‌ను ఆయ‌న కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వహించారు. మే 1వ తేదీ నుండి ఈ కార్యక్రమం ప్రతి రోజూ జ‌రుగుతుంద‌ని ఆయ‌న ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు. శుక్రవారం క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గంలోని 11వ వార్డు 203 బూత్ ఇంచార్జి రాముడు, 14వ వార్డు 123వ బూత్ ఇంచార్జి నాగ‌రాజు, 47వ వార్డు 142 బూత్ ఇంచార్జి శ్యామ్, 49వ వార్డు 177 బూత్ ఇంచార్జి మణి ప్రకాష్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మంత్రి కార్యాల‌యంలో కేక్ క‌ట్ చేయించారు. ఈ కార్యక్రమంలో కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంక‌టేశ్వర్లు, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, తెలుగుదేశం పార్టీ న‌గ‌ర అధ్యక్షుడు కొర‌కంచి ర‌వి, ఏపీఐఐసీ డైరెక్టర్ జ‌గ‌దీష్ గుప్తా, రాష్ట్ర హ‌జ్ కమిటీ సభ్యులు సూరి మ‌న్సూర్ అలీ ఖాన్, ఎం.ఎస్.ఎం.ఈ డైరెక్టర్ కౌశిక్, త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సోమిశెట్టి వెంక‌టేశ్వర్లు మాట్లాడుతూ ఎల్లప్పుడూ కార్యక‌ర్తల గురించి ఆలోచించే నాయ‌కుడు మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. ఆయన కార్యాల‌యంలో బ‌ర్త్ డే వేడుక‌లు నిర్వహించ‌డంతో పాటు మౌర్య ఇన్ హోట‌ల్‌లో కార్యక‌ర్తల కుటుంబాల‌కు ప్రత్యేకంగా విందును ఏర్పాటుచేశార‌ని ఆయ‌న తెలిపారు. ఈ సందర్భంగా బ‌ర్త్ డే చేసుకున్న బూత్ ఇంచార్జిలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. పుట్టిన‌రోజు జ‌రుపుకున్న కార్యక‌ర్తల‌తో మంత్రి టీజీ భరత్ గుప్తా వీడియో కాల్‌లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *