వైయస్సార్ టియుసీ ఆధ్వర్యంలో ‘మే’డే వేడుకలు
1 min read
కార్మికులకు అండగా వైసీపీ పార్టీ..
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శుక్రవారం ‘మే’డే వేడుకలుఘనంగా నిర్వహించారు. శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరియు నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ ఆదేశాల మేరకు నందికొట్కూరు పట్టణంలో శుక్రవారం వైయస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పలదడియ మోమిన్ మన్సూర్ ఆధ్వర్యంల ‘మే’డే వేడుకలు 50 ఆటోలతో పట్టణంలో ర్యాలీ చేపట్టారు.ఆటోలకు వైసిపి జెండాలను కట్టుకొని ఆట కార్మికులు మరియు వైసీపీ నాయకులు ముందుగా వైసీపీ పార్టీ కార్యాలయం నుండి పటేల్ సెంటర్ వైయస్సార్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు.తర్వాత అక్కడ పగిడ్యాల మండల కన్వీనర్ పుల్యాల నాగిరెడ్డి, మోమిన్ మన్సూర్,పట్టణ అధ్యక్షులు మన్సూర్ వైఎస్ఆర్ టియుసి జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల కార్మికులకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో రమేష్ నాయుడు, జడ్పీటీసీ సోముల సుధాకర్ రెడ్డి,జబ్బార్,చింతా విజ్జి,రైతు సంగం బాబు,యాట ఓబులేష్,మాదురి,నాగార్జున రెడ్డి,చరణ్,లడ్డు తదితరులు పాల్గొన్నారు.

