NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లేబర్ కోడ్ లు రద్దు చేసేంత వరకు పోరాడాలి

1 min read

మేడే స్పూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాడాలి

ఘనంగా జరిగిన కార్మికుల పండుగ 104వ మేడే.

భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య

సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు.

ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఏలూరు ఏరియా సమితి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి) సంయుక్తంగా 104వ మేడే కార్యక్రమాన్ని వాడవాడల ఏఐటీయూసీ, సిపిఐ పార్టీ జెండాలు ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాలలో పాల్గొన్న సిపిఐ ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ అమెరికా దేశంలో చికాగో నగరంలోని హే మార్కెట్లో కార్మికులు తమ హక్కుల కోసం పోరాడి ప్రాణత్యాగాల ద్వారా సాధించిన విజయాలకు గుర్తుగా ప్రతి ఏటా మే ఒకటవ తేదీని ప్రపంచవ్యాప్తంగా కార్మికుల పండుగగా మేడేగా జరుపుకుంటారని తెలిపారు. మనదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఎనిమిది గంటల పదిని విధానాన్ని మార్పు చేసి 10,12 గంటలు కార్మికులు శ్రమ చేసే విధంగా చట్టాలను చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు దేశంలోని కార్మిక వర్గం ఉద్యమాలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శ్రమజీవులు అందరికీ పండుగ రోజు మేడే అని కొనియాడారు. మేడే స్ఫూర్తితో కార్మికులు తమ హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఆటోమొబైల్ ఆల్ ట్రేడ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించిన జెండా ఆవిష్కరించిన యూనియన్ అధ్యక్షులు ఉప్పులూరి కేశవరావు మాట్లాడుతూ కార్మికులంతా ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడాలని కార్మిక సంఘాలను పటిష్టపరుచుకోవాలని పిలుపునిచ్చారు. 40 డివిజన్ లో పార్టీ జెండా ఆవిష్కరించిన ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్ మాట్లాడుతూ కార్మిక వర్గం చేసే ప్రతి పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతు సహకారం ఉంటుందని తెలిపారు. ఆటోనగర్ లో మేడే జెండా ఆవిష్కరణ చేసిన అధ్యక్షులు అరుణతార నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలోని కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేసి అనేక చట్టాలను కార్మికులకు సాధించి పెట్టారని వాటిని మార్పు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పే విధంగా కార్మిక వర్గం ఉద్యమించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాలలో ఏలూరు ఏరియా సమితి సభ్యులు కొండేటి రాంబాబు,కె రమేష్, మోరు అమర్నాథ్, మరకాల సందీప్, దాసిపల్లి ఆదినారాయణ, వేముల వెంకటేష్, దాసిపల్లి ఎర్రయ్య, చేపూరి రాజు, యలగాడ శివకుమార్,ఉప్పులూరి లక్ష్మి,భవాని, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు శాఖ అధ్యక్షులు బంగారు దుర్గాప్రసాద్, అడపా సత్యనారాయణ, కాశి, తాళ్లూరి బాబురావు, మహబూబ్ షరీఫ్,రవికుమార్,అబ్దుల్ లుక్మన్, లక్ష్మణరావు, జుజ్జువరపు సన్నీ, ఎర్ర వెంకటేశ్వరరావు, పంతం రాంబాబు కొండేటి ఆదామ్, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *