మండల టాపర్ ను అభినందించిన జడ్పిటీసీ
1 min read
మిడుతూరు, (నందికొట్కూరు) న్యూస్ నేడు: పదవ తరగతి ఫలితాల్లో మిడుతూరు మండల టాపర్ గా నిలిచిన దూదేకుల మషీరాను మిడుతూరు మండల జడ్పిటీసీ సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డి అభినందించారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కలమందలపాడు గ్రామానికి చెందిన దూదేకుల మషీరా(582) మార్కులతో మంచి ఉత్తీర్ణత కనబరిచారు. మషీరా స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ మండల టాపర్ గా నిలవడం విశేషం.మషీరాను జడ్పిటీసీ యుగంధర్ రెడ్డి శనివారం శాలువా పూల బోకేతో ఘనంగా సత్కరించారు.ఉన్నత లక్ష్యంతో చదువుకొని తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని జెడ్పిటిసి యుగంధర్ రెడ్డి విద్యార్థికి సూచించారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ మండల కార్యదర్శి కలమందలపాడు మహబూబ్ బాష,తండ్రి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సైసావలి పాల్గొన్నారు.

