NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్టీఆర్​ హెల్త్ యూనివర్సిటీ సెనేట్ మెంబర్ లు ఎంపిక

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ఎన్టీఆర్​ హెల్త్ యూనివర్సిటీ సెనేట్ మెంబర్ లు ఎంపీక డా. సింధియా శుభప్రద,డా. బాలేశ్వరి,డా. జయరాం…. యూనివర్సిటీకి అభినందనలు తెలిపిన అడిషనల్ డీఎంఈ. & మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ… ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి సెనేట్ మెంబర్లుగా కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి ముగ్గురు ఎంపిక కావడం జరిగింది. ఇందులో డాక్టర్. సింధియా శుభప్రద ప్రొఫెసర్ & విభాగాధిపతి కమ్యూనిటీ మెడిసిన్ విభాగము & వైస్ ప్రిన్సిపల్. డా. బాలేశ్వరి, ప్రొఫెసర్ & హెచ్.ఓ.డి    పేథాలజీ విభాగాధిపతి. డా. గంగా జయరాం, ప్రొఫెసర్, సర్జరీ విభాగం, కె.యం.సి వీరు ముగ్గురు మూడు సంవత్సరాల కాలం యూనివర్సిటీకి సెనేట్ మెంబర్ గా ఉంటారు.  యూనివర్సిటీ కి వైద్య విద్యలో స్టాండర్డ్స్ పెంచేందుకు   సిలబస్, టీచింగ్ స్టాండర్డ్స్ మెయింటెనెన్స్ లాంటి మొదలగు విషయాల్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చేసిన రెకమండేషన్స్ ను సెనేట్ మెంబర్ లు స్టడీ చేసి యూనివర్సిటీకి  తీర్మానాల రూపంలో అప్రూవల్ కొరకు సిద్ధం చేస్తారు.  అందిస్తారు. కర్నూల్ మెడికల్ కాలేజ్ నుంచి ముగ్గురు వైద్యులను  యూనివర్సిటీ సెనేట్ సబ్యులు గా ఎంపిక చేయడం పట్ల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఎంపికైన ముగ్గురు ప్రొఫెసర్ లకు అడిషనల్ డీఎంఇ, కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ అభినందనలు తెలియజేయడం జరిగింది. ఎంపిక కాబడిన ముగ్గురు ప్రొఫెసర్లు మాట్లాడుతూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి మరింత వన్నె తెచ్చేందుకు వైద్య విద్య పురోగతికి తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *