NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దెందులూరు మండలం గాలాయగూడెం వద్ద రోడ్డు ప్రమాదం

1 min read

గాయాల పాలైన వృద్ధుడిని  దెందులూరు ఎమ్మెల్యే  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్సలు అందేలా చొరవ

చింతమనేని కి కృతజ్ఞతలుతెలిపిన బాధిత కుటుంబీకులు

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరు మండలం గాలాయగూడెం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు.అయితే అదే సమయంలో అటుగా వెళుతున్న దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్  వెంటనే తన కాన్వాయ్ ని ఆపి బాధితుడు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్షతగాత్రుడికి,అతని బంధువులకు అధైర్య పడవద్దు అంటూ తను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు.  ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే తన సొంత కారులో క్షతగాత్రుడిని అతని బంధువులతో కలిసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు.నిజమైన ప్రజా నాయకుడు గా దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.దీంతో క్షతగాత్రుడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

About Author