సత్పురుషుల సాంగత్యమే జీవితానికి సార్థకత
1 min read
శ్రీనివాస రామానుజ దాసు
కర్నూలు, న్యూస్ నేడు: మహనీయులను ఆశ్రయిస్తే మనసు శుద్దిపడి, పవిత్రులవుతారని అందుకే అనాది నుండి గురుశిష్య పరంపర కొనసాగుతూ మానవుడు తన్నుతాను ఉద్దరించుకోవడం జరుగుతుందని గుంటూరు జిల్లా, నంబూరు ఆశ్రమం పౌరాణికులు, మధుర వాచస్పతి శ్రీనివాస రామానుజదాసు అన్నారు. కర్నూలు నగరంలోని శ్రీ భరతమాత ఆలయంనందు జరుగుతున్న సుందరకాండ ప్రవచన సప్తాహంలో భాగంగా నాలుగవరోజు ప్రవచనం కొనసాగించారు. ముందుగా ప్రవచనకర్తకు శేషవస్త్రంతోపాటు పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత విష్ణుసహస్రనామ సాంస్కృతిక సమాఖ్య ఉపాధ్యక్షులు మల్లెల పెద్ద పుల్లారెడ్డి, భరతమాత సేవా సమితి సహకార్యదర్శి కార్యవర్గ సభ్యులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.శివశంకర్ రెడ్డి, చంద్రారెడ్డి, నారాయణరెడ్డి, లావణ్య, శకుంతల, పద్మావతి, కాత్యాయనీ, శ్రీలక్ష్మి, వసుంధరమ్మ, ప్రమీల, రత్నమ్మ తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


