పదో తరగతిలో ప్రతిభ చాటిన కొవ్వలి విద్యార్థులు
1 min read
దుగ్గిరాల క్యాంపు ఆఫీస్ లో ఘన సత్కారం
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపున ప్రత్యేక అభినందనలు
దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో విద్యార్థులకు శాలువాలు, జ్ఞాపికల అందజేత
విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు ఎమ్మెల్యే చింతమనేనిఆశీస్సులు
పేదరికాన్ని జయించి ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతమైన మార్కులు
ఎంపీడీవో చింతమనేని విష్ణు
ఏలూరు, న్యూస్ నేడు: ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాలలో దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలోని పీఎంపీ ఎస్ వి ఏ ఆర్ బి జెడ్పీ హైస్కూల్ ప్లస్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, తమ పాఠశాలకు మరియు గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా సోమవారం దుగ్గిరాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సత్కార కార్యక్రమం నిర్వహించబడింది.పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన 15 మంది విద్యార్థులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యక్తిగత కార్యదర్శి (పి ఏ ), రూరల్ మండల డిప్యూటీ ఎంపీడీవో చింతమనేని విష్ణు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఎమ్మెల్యే తరపున విద్యార్థులందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా చింతమనేని విష్ణు మాట్లాడుతూ పేదరికాన్ని జయించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అద్భుతమైన మార్కులు సాధించిన ఈ విద్యార్థులే దెందులూరు నియోజకవర్గానికి అసలైన సంపద అని కొనియాడారు. విద్యార్థులు రాబోయే రోజుల్లో ఇదే పట్టుదలతో చదివి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, తమ తల్లిదండ్రులకు మరియు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆశిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల చదువులకు ఎమ్మెల్యే సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.


