NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోళగుంద టాపర్ శాలి సక్లిన్‌కు ఘన సన్మానం

1 min read

ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ప్రతిభకు వైసీపీ నేతల అభినందనలు

582 మార్కులతో హోళగుందలో ప్రతిభ చాటిన శాలి సక్లిన్

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యార్థి విజయం

ఉన్నత చదువులతో మరింత రాణించాలని యస్‌కే గిరి ఆకాంక్ష

హోళగుందన్యూస్ నేడు; హోళగుంద మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్షల్లో 582 మార్కులు సాధించి హోళగుంద టాపర్‌గా నిలిచిన విద్యార్థి శాలి సక్లిన్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్.కే. గిరి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థికి అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు అందించారు.ఈ సందర్భంగా యస్.కే. గిరి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యుత్తమ మార్కులు సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. శాలి సక్లిన్ సాధించిన ప్రతిభ పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చిందని కొనియాడారు.విద్యార్థులు కష్టపడి చదివితే ప్రభుత్వ పాఠశాలల నుంచే గొప్ప విజయాలు సాధించవచ్చని ఈ ఫలితం నిరూపించిందన్నారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత చదువులు అభ్యసించి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మస్తాన్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *