గ్రామాల్లో పారిశుధ్యంపై రాజీ పడే ప్రసక్తే లేదు
1 min read
ఎవరైనా అలసత్వం వహిస్తే మాత్రం ఉపేక్షించు
అధికారుల పని తీరుపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అసంతృప్తి
రామసింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పారిశుద్ధ్యం పై ఆకస్మిక పర్యటన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదవేగి మండలం రామసింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పారిశుద్ధ్యం పై ఆకస్మిక పర్యటన-అధ్వాన్నంగా ఉన్న డ్రైనేజీల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రభుత్వ లక్ష్యాలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని అధికారులకు హితవు పలికారు.గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో కూటమి శ్రేణులు కూడా భాగస్వామ్యం కావాలనీ సూచనలు సలహాలు అందించారు.
పెదవేగి మండలం రామసింగవరం
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ మరియు ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అధికారులను సున్నితంగా హెచ్చరించారు. శుక్రవారం ఉదయం పెదవేగి మండలం రామసింగవరం గ్రామంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని అంతర్గత వీధుల్లో డ్రైనేజీలు పూడిక తీయక, మురుగునీరు నిలిచిపోయి అధ్వాన్నంగా ఉన్న పరిస్థితిని చూసి ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంపై స్థానిక అధికారులు, సిబ్బంది పని తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర’ పేరుతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, క్షేత్రస్థాయిలో డ్రైనేజీలు ఈ విధంగా ఉండటం అధికారుల అలసత్వానికి నిదర్శనమని” విమర్శించారు. తక్షణమే తమ పనితీరు మార్చుకోవాలని, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని సూచించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు..
కేవలం అధికారులే కాకుండా, స్థానిక కూటమి నాయకులు మరియు కార్యకర్తలు కూడా గ్రామాల అభివృద్ధిలో బాధ్యత వహించాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోరారు. పారిశుధ్య నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పిలుపునిచ్చారు.గ్రామస్తులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పారిశుధ్యం సహా ఇతర స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిలిచిపోయిన మురుగునీటిని వెంటనే తొలగించి, బ్లీచింగ్ చల్లించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

