స్ఫూర్తి దివ్యాంగుల సేవా కమిటీ సేవలు స్ఫూర్తిదాయకం అభినందనీయం
1 min read
జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ పంపిణీ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరం ప్రాంగణంలో సోమవారం స్ఫూర్తి దివ్యాంగుల సేవా కమిటీ ఆధ్వర్యంలో పిజిఆర్ఎస్ కు వచ్చిన ప్రజలకు సుమారు 600 చల్లని మజ్జిగ ప్యాకెట్లను జిల్లా జాయింటు కలెక్టరు అర్జీదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు స్ఫూర్తి దివ్యాంగుల సేవా కమిటీ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించుట అభినందనీయమని అన్నారు. ప్రజలకు సేవ చెయ్యడం బాధ్యత అని, ప్రతి ఒక్కరూ ఒక మంచి అలవాటుగా చేసుకోవాలని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి.దేవరాజు, గౌరవ అధ్యక్షులు ఏ.కృష్ణ భాస్కర్, కార్యదర్శి కె.ఏసుబాబు, తదితర కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

