NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎల్ నినో’ ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

1 min read

దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ వెల్లడి

వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశం

వ్యవసాయ,ఉద్యానవన పంటలలో అవసరమైన ప్రత్యామ్నాయ విధానాలపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలి

క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ – ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రకృతి వైపరీత్యాలు మరియు వాతావరణ మార్పుల వల్ల రైతులు నష్టపోకుండా ముందస్తుగా అప్రమత్తం చేయడమే ప్రభుత్వ బాధ్యతని దెందులూరు శాసనసభ్యులు  చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం దుగ్గిరాలలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నిత్య ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వాతావరణంలో సంభవిస్తున్న మార్పులపై వ్యవసాయ, ఉద్యానవన శాఖపై ప్రత్యేకంగా సమీక్షించారు.ఎల్ నినో ప్రభావం  అధికారులకు ఆదేశాలు:ఈ సందర్భంగా ఎమ్మెల్యే  ప్రభాకర్  మాట్లాడుతూఈ ఏడాది అంతర్జాతీయ వాతావరణ మార్పులైన”ఎల్ నినో”ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనాలు వేస్తుందని, దీనివల్ల సాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. “రైతు సోదరులు పరిస్థితులకు అనుగుణంగా తమ పంటల సాగు ప్రణాళికను మార్చుకోవాలని సూచించారు. అధికారులు తక్షణమే గ్రామాల్లో పర్యటించి, వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంటలు మరియు నీటి పొదుపు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని” ఆదేశించారు.

రైతులకు కీలక సూచనలు:  తక్కువ నీటితో పండే పంటలు వర్షాభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేలా సంబంధిత అధికారులు రైతులను  ప్రోత్సహించాలి అని సూచించారు.వ్యవసాయ మరియు ఉద్యానవన పంటల రైతులు తీసుకోవాల్సిన మెళకువలపై క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలి అని అధికారులకు సూచించారు.అధికారుల బాధ్యతరైతు సేవ కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువుల లభ్యతతో పాటు వాతావరణ సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు చేరవేయాలి అని అన్నారు.ప్రజా సమస్యల పరిష్కారంఅనంతరం నిత్య ప్రజా దర్బార్లో  భాగంగా నియోజకవర్గవ్యాప్తంగా వచ్చిన అర్జీదారులతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  ముఖాముఖి మాట్లాడారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ మరియు విద్యుత్ శాఖలకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకుని, అర్హులైన వారికి తక్షణమే న్యాయం చేయాలని అధికారులను కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే ప్రభాకర్  స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు,కూటమి నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

About Author