NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భక్తి శ్రద్ధలతో శ్రీహనుమాన్ జయంతి మహోత్సవం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: మనోజవం మారుత తుల్యవేగం। జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం। వాతాత్మజం వానర యూధ ముఖ్యం: శ్రీరామదూతం శిరసానమామి||ప్యాపిలి పట్టణంలోని  వెలసిన శ్రీ అంజినేయస్వామి దేవాలయంలో శ్రీహనుమాన్ జయంతి వేడుకలు వైభవముగా నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి భక్తులు తరలివచ్చి, స్వామి వారికి పంచామృత ఆభిషేకము, ఆకుపూజ, మాహానీరాజనం, తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు నాగేంద్ర భక్తులకు దర్శనం కలిపిస్తు తీర్థప్రసాదాలు అందజేశారు.మద్యాహ్నం 12-00గం|| మహామంగళహారతి, తీర్థ ప్రసాదల అనంతరం మద్యాహ్నం 12-30గం|| విచ్చేసిన భక్త జనులకు అన్నదాన కార్యక్రమము చేపట్టారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకొని అన్నదాన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author