శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో భక్తులు రద్దీ
1 min read
వివిధ సేవల రూపేణా రూ.7,33,190/-లు ఆదాయo
సుమారు 10500 మంది భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రము నందు అన్నప్రసాద వితరణ
సహాయ కమీషనరు, కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భక్త జన సంద్రం గా మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంమంగళవారం హనుమద్ జయంతి మహా పర్వదిన సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం లో వేంచేసియున్న శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము చుట్టు ప్రక్కల గ్రామముల నుండియే గాక సుదూర ప్రాంతముల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీ స్వామి వారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు,వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకునినారు. ఈ రోజు సుమారు 30000 ల మంది భక్తులు శ్రీ స్వామి వారి దర్శనార్ధం విచ్చేసినారు. ఈ రోజు మద్యాహ్నం/సాయంత్రం గం.3-00 వరకూ విచ్చేసిన సుమారు 10500 మంది భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రము నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. ఈ రోజు మద్యాహ్నం/సాయంత్రం గం.4-30 వరకూ శ్రీ స్వామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణా రూ.7,33,190/ -లు ఆదాయము వచ్చినది. ఈ శ్రీ స్వామి వారి దర్శనార్ధమై విచ్చేసిన భక్తుల రద్దీ దృష్ట్యా జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.వి సుభాష్ వారి ఆద్వర్యములో లక్కవరం ఎస్ ఐ ఎస్ కె జాబిర్, జంగారెడ్డిగూడెం ఎస్ ఐ వరప్రసాద్, మరియు జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ ఐ యం.కుటుంబరావు భారీ బందోభస్తూ ఏర్పాటు చేసినారు. ఇంకా జంగారెడ్డిగూడెం అగ్నిమాపక సిబ్బంది, బొర్రంపాలెం పి హె చ్ సి వారిచే మెడికల క్యాంప్ మరియు జంగారెడ్డిగూడెం మమత హాస్పిటల్ వారిచే ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయుట జరిగినదని ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెల్పినారు.


