గ్రామస్తులకు మాట ఇచ్చాం…
1 min read
ఆ మాట ప్రకారం పిల్లలను
తీర్చిదిద్దాం :-అబ్దుల్ లతీఫ్
ప్యాపిలి న్యూస్ నేడు: గత విద్యాసంవత్సరం జూన్ 9 న పదోన్నతి పై చండ్ర పల్లె పాఠశాలకు వచ్చినప్పుడు గ్రామస్తులకు మాట ఇచ్చాను.మీ పిల్లల భవిష్యత్ కు భరోసా మాది అని.ఆ మాట ప్రకారం పిల్లలను బాగా తీర్చిదిద్దాం.అందులో భాగంగానే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష లో ఇద్దరు ఎన్నిక కావడం..అందుకని ఈరోజు మరలా చండ్రపల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి ముచ్చటగా మూడోసారి తల్లిదండ్రులను కలిసి పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించండి అని అడగడం జరిగింది.ఈరోజు ప్రైవేటు పాఠశాల నుండి 4 గురు విద్యార్థులు మా పాఠశాలలో చేరారు.మొన్నటి మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలో మా పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులు ఎన్నిక కావడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ బడి వైపు చూస్తున్నారు.త్వరలోనే రచ్చబండ వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రామస్తులందర్ని ఏకం చేసి ప్రభుత్వ బడి వైపు అందరూ వచ్చేలా చేస్తామని ఈరోజు గ్రామస్తులు మాట ఇచ్చారు.ప్రభుత్వ బడిని రక్షించుకునే క్రమంలో మా ఉపాధ్యాయుల కృషికి గ్రామస్తులు సహకరించడం ఆనందదాయకం.వీలైంత త్వరగా గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ బడిలో మరికొంత మందిని చేర్చుకుంటామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ లతీఫ్ తెలియచేశారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివకేశవులు,గ్రామస్తులు,పిల్లలు పాల్గొన్నారు.


