ఘనంగా బడిపిలుస్తుంది – ప్రభుత్వ బడి పిలుస్తుంది కార్యక్రమం
1 min read
హోళగుంద న్యూస్ నేడు: హోళగుందమండలంలోని కోగిలతోట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో “బడిపిలుస్తుంది – ప్రభుత్వ బడి పిలుస్తుంది” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు MEO-1, MEO-2, సిఆర్పీలు (CRPs), ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అంగన్‌వాడి కేంద్రాలకు సంబంధించిన 5 ప్లస్ వయస్సు గల చిన్నారులను పాఠశాలలో చేర్పించడం, అలాగే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గ్రామంలో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు కల్పించడం అని అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారులు అంగన్‌వాడి కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అడ్మిషన్లు చేపట్టించారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు మధ్యాహ్న భోజన పథకం, ఉచిత యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు, షూస్, ఇంగ్లీష్ అభ్యాసానికి డిక్షనరీలు మరియు అనేక విద్యా సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తున్నదని వివరించారు.ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అధికారులు కోరారు. గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడిందని తెలిపారు.


