NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వట్లూరులో వైభవంగా శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి ఆలయ12వ వార్షికోత్సవం

1 min read

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో వెలసిన శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా జరిగాయి.  వేడుకల్లో భాగంగా ఆలయం వద్ద  ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ వేడుకల ముగింపు సందర్భంగా బుధవారం జరిగిన ప్రధాన క్రతువులకు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం నుండే వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యారాధన వంటి పవిత్ర కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో కుంభాభిషేకం మరియు అకల్మష హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకుని, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కి ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే ని శాలువాతో ఘనంగా సత్కరించారు.వార్షికోత్సవం సందర్భంగా ఆలయానికి పోటెత్తిన భక్తుల కోసం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పెదపాడు మండల టిడిపి కార్యదర్శి వేగుంటసురేష్ బాబు సహా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *