పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలి
1 min read
సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర
న్యూస్ నేడు, పత్తికొండ: ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెంచుతూ సామాన్య ప్రజలపై రవాణా రంగం కార్మికులపై పెనుబారం మోపిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం పత్తికొండ పట్టణంలోని స్థానిక ముక్కెళ్ల మారెళ్ళ ఆర్ఎస్ పెండేకల్ ఆటో కార్మికుల సెంటర్ నుండి స్థానిక నాలుగు స్తంభాల కూడలి దగ్గర వరకు సిఐటియు ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు ఆటో కార్మిక సంఘం నాయకులు గిరిబాబు అధ్యక్షతన వహించారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల పేద మధ్యతరగతి ప్రజలపై పెనుబారంగా మారిందని నరేంద్ర మోడీ నియంతృత్వ ధోరణి విడనాడాలని, ఒకపక్క ఆధిపత్యం కోసం యుద్ధం వల్ల అనేక దేశాలు అతలాకుతలం అవుతుంటే కనీసం యుద్ధం నివారించాలని ప్రకటన కూడా చేయకపోవడం నరేంద్ర మోడీ రాక్షసత్వానికి నిదర్శనమని అన్నారు. గతంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన సమయంలో కూడా పేద, మధ్యతరగతి కుటుంబాలకు తగ్గించకుండా కేవలం ఆయన కనుసన్నల్లో ఉన్న బడాబాబులకు మాత్రమే వెసులుబాటు కల్పించడం కోసం పెట్రోల్ డీజిల్ తగ్గించకుండా కొనసాగించడం నేడు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ ఆదాని అంబానీ లకు లాభాలు చేకూర్చడం కోసం పెట్రోల్ డీజిల్ ధరలను అమాంతం పెంచడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

